కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం | Labor policy approved by ilo | Sakshi
Sakshi News home page

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

Jun 14 2015 12:44 AM | Updated on Sep 3 2017 3:41 AM

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

కార్మిక విధానానికి ఐఎల్‌వో ఆమోదం

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం పరిధిలోకి వచ్చేందుకు వీలుగా ...

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు అసంఘటిత రంగం నుంచి సంఘటిత రంగం పరిధిలోకి వచ్చేందుకు వీలుగా ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్‌వో) ఓ విధానాన్ని ఆమోదించింది. జెనీవాలో శుక్రవారం జరిగిన 104వ అంతర్జాతీయ కార్మిక సదస్సులో 484 ఓట్ల మెజార్టీతో దీన్ని ఆమోదించారు.

భారత్‌లో 93 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే ఉన్నారని, ఈ అంశంపై చర్చల్లో భారత్ కీలక పాత్ర పోషించిందని ఐఎల్‌వో ఉపాధి విధాన శాఖ డెరైక్టర్ అజితా అవద్ అన్నారు. సదస్సుకు భారత్ తరపున కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ హాజరై ప్రసంగించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement