కిర్రాకు పుట్టించిన కేజ్రీవాల్ | kejriwal victory in delhi elections | Sakshi
Sakshi News home page

కిర్రాకు పుట్టించిన కేజ్రీవాల్

Feb 10 2015 2:16 PM | Updated on Mar 29 2019 9:31 PM

కేజ్రీవాల్ కిర్రాకు పుట్టించారు. ఢిల్లీని కైవసం చేసుకుని తాను ఎవరికీ కొరుకుడుపడనని చెప్పేశారు.

న్యూఢిల్లీ: కేజ్రీవాల్  కిర్రాకు పుట్టించారు. ఢిల్లీని కైవసం చేసుకుని తాను ఎవరికీ కొరుకుడుపడనని  చెప్పేశారు. మీడియాను కాదు..  ప్రజలను నమ్ముకోవాలని పరోక్షంగా కేజ్రీవాల్ విజయం గొప్ప సందేశాన్ని  రాజకీయ పార్టీలకు పంపారు. నిత్యం ప్రజల మధ్యనే ఉండేవాళ్లనే  ఓటర్లు నమ్ముతారని ఆప్‌ విజయం చెబుతోంది.


చెప్పిన మాటకు కట్టుబడి ఉండటం...ఉన్న 49 రోజుల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి.. పడిన తాపత్రయాన్ని ఢిల్లీ గుర్తించే  ఇంతటి భారీ విజయాన్ని చూకూర్చి పెట్టారని  విశ్లేషకులు అంటున్నారు. ఎన్ని రోజులు పాలించం కాదు..ఎలా పాలించామనేది ఢిల్లీ ఓటర్లు పరిగణనలోకి తీసుకుని ఓట్లు వేసినట్లు కనిపిస్తోంది...14 వేల ఓట్ల  తేడాతో కిరణ్ బేడీ కృష్ణా నియోజకవర్గంలో  వెనకబడింది.

Advertisement
 
Advertisement
Advertisement