'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్ | Kejriwal rejects security cover | Sakshi
Sakshi News home page

'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్

Feb 11 2015 4:37 PM | Updated on Sep 2 2017 9:09 PM

'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్

'జెడ్ ప్లస్' భద్రతను తిరస్కరించిన కేజ్రీవాల్

ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అదనపు భద్రతను తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

న్యూఢిల్లీ: ఢిల్లీ కాబోయే ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అదనపు భద్రతను తిరస్కరించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్ బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు. అనంతర ఆప్ నాయకులు మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రజల మనిషి అని, ఆయనకు ఎలాంటి భద్రతా అవసరం లేదని చెప్పారు. కేజ్రీవాల్కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ పోలీసులు చెప్పిన నేపథ్యంలో ఆప్ వర్గాలు స్పందించాయి.

ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 70 సీట్లున్న అసెంబ్లీలో ఆప్ 67 స్థానాల్లో జయభేరి మోగించింది. ఆప్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన కేజ్రీవాల్ ఈ నెల 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement