చనిపోయిన ఆ జర్నలిస్టు సోదరికి ఉద్యోగం | Kejriwal offers job to journalist's sister | Sakshi
Sakshi News home page

చనిపోయిన ఆ జర్నలిస్టు సోదరికి ఉద్యోగం

Jul 8 2015 4:56 PM | Updated on Nov 6 2018 4:10 PM

వ్యాపం స్కాంకు సంబంధించి కవరేజ్కు వెళ్లి చనిపోయిన ఓ జర్నలిస్టు సోదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగం ప్రకటించారు.

న్యూఢిల్లీ: వ్యాపం స్కాంకు సంబంధించి కవరేజ్కు వెళ్లి చనిపోయిన ఓ జర్నలిస్టు సోదరికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యోగం ప్రకటించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆ జర్నలిస్టు కుటుంబాన్ని పరామర్శించి ఇదే విషయం స్పష్టం చేశారు.

జూలై 4 వ్యాపం కుంభకోణానికి సంబంధించి కవరేజ్కోసం వెళ్లిన అజ్ తఖ్ చానెల్ జర్నలిస్టు అక్షయ్ సింగ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఫలితంగా వారి కుటుంబం రోడ్డున పడినట్లయింది. దీంతో వారికి ఆర్థిక చేయూతనివ్వడంతోపాటు మనోధైర్యాన్నివ్వాలనే ఉద్దేశంతో తాము అక్షయ్ సింగ్ సోదరికి ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించామని సిసోడియా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement