ఢిల్లీ అభివృద్ధికి సహకరిస్తాం: వెంకయ్య | Kejriwal meets venkaiah naidu | Sakshi
Sakshi News home page

ఢిల్లీ అభివృద్ధికి సహకరిస్తాం: వెంకయ్య

Feb 11 2015 11:36 AM | Updated on Sep 2 2017 9:09 PM

ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్, పార్టీ ఎమ్మెల్యే మనీష్ సిసోడియా బుధవారం ఉదయం వెంకయ్యను కలిశారు. ఈ భేటీ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ అనధికార కాలనీల క్రమబద్దీకరణ, కొత్త కళాశాలలు, స్కూళ్ల స్థలాల అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రమాణ స్వీకారానికి రావాలని కేజ్రీవాల్ ఆహ్వానించారని ఆయన తెలిపారు.

వెంకయ్యతో భేటీపై సిసోడియా మాట్లాడుతూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరామన్నారు. ఢిల్లీలో అనాధికార కాలనీలను క్రమబద్దీకరించడానికి కేంద్రం సహకరించాలని కోరామని సిసోడియా తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ఢిల్లీ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి, గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తామని సిసోడియా తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement