దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా? | is narendra modi a god, asks mallikarjun kharge | Sakshi
Sakshi News home page

దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా?

Jul 23 2014 6:29 PM | Updated on Aug 15 2018 2:20 PM

దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా? - Sakshi

దర్శనమివ్వడానికి మోడీ ఏమైనా దేవుడా?

అప్పుడప్పుడు వచ్చి దర్శనం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏమైనా దేవుడా అని లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.

అప్పుడప్పుడు వచ్చి దర్శనం ఇవ్వడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏమైనా దేవుడా అని లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దీంతో ఒక్కసారిగా లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు నవ్వుల్లో మునిగిపోయారు. కనీసం వారానికి ఒక రోజైనా ప్రధాని మోడీ పార్లమెంటుకు ముఖం చూపించాలన్న వ్యాఖ్యలపై విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మండిపడటంతో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాని సభలోనే ఉన్నారని, 'మీరు కావాలంటే ఆయన దర్శనం చేసుకోండి' అని సుష్మా అనడంతో మండిపడిన ఖర్గే.. మోడీ ఏమైనా దేవుడా అంటూ నిలదీశారు. ప్రధాని ప్రతిరోజూ కాకపోయినా కనీసం వారానికి ఒకసారైనా సభకు వచ్చి ముఖం చూపించాలని, బడ్జెట్ సమావేశాల తర్వాత అసలు ఆయన సభకే రావట్లేదని ఖర్గే బుధవారం నాడు సభలో వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement