భారీస్థాయిలో డ్రగ్స్‌ ధ్వంసం | Illegal Drugs Worth 7Crores Destroyed In Tripura | Sakshi
Sakshi News home page

భారీస్థాయిలో డ్రగ్స్‌ ధ్వంసం

Apr 4 2019 5:26 PM | Updated on Apr 4 2019 5:26 PM

Illegal Drugs Worth 7Crores Destroyed In Tripura - Sakshi

సాక్షి, అగర్తలా(తిపుర): త్రిపురలో దాదాపు 8 కోట్ల రూపాయల విలువైన నిషేధిత మత్తు పదార్థలను పోలీసులు ధ్వంసం చేశారు. గత రెండు, మూడు నెలలుగా వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తుండగా ఈ పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. భారీస్థాయిలో ధ్వంసం చేసిన నిషేధిత పదార్థాలలో 4752 కిలోల గంజాయి, 56 కేజీల దగ్గుమందు సీసాలు, 3500 మందు బిల్లలు, 1.96 కేజీల హెరాయిన్‌ను ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

నిషేధిత పదార్థాలను ధ్వంసం చేసే ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, గడిచిన సంవత్సరంలో 70వేల కేజీల డ్రగ్స్‌ను ధ్వంసం చేశామన్నారు. ప్రతినెల మత్తు పదార్థాలను ధ్వంసం చేస్తున్నామని, గడిచిన నెలలో వేరే పని ఉండటం వల్ల బ్రేక్‌ పడిందని ఇంటెలిజెన్స్‌ డీఐజీ డీ డార్లంగ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement