కాసేపట్లో వైమానిక దాడులు.. కానీ | IAF planned to bomb targets in Pakistan during Kargil conflict | Sakshi
Sakshi News home page

కాసేపట్లో వైమానిక దాడులు.. కానీ

Jul 20 2016 2:03 AM | Updated on Sep 4 2017 5:19 AM

1999 జూన్ 13.. తెల్లవారుజాము 4.30 గంటలు.. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం భీకరంగా సాగుతోంది.

* ‘కార్గిల్’ సమయంలో పాక్‌పై దాడులకు వాయుసేన ప్రణాళిక
* ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించిన ఎన్డీటీవీ

న్యూఢిల్లీ: 1999 జూన్ 13.. తెల్లవారుజాము 4.30 గంటలు.. భారత్, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం భీకరంగా సాగుతోంది. పాక్‌పై దాడులకు భారత వాయుసేన ప్రణాళిక రూపొందించింది. విమానాలను సిద్ధం చేసింది.. లక్ష్యాలను గురిపెట్టింది.. తుపాకులు, మందుగుండు సామగ్రితో పైలట్లు సిద్ధంగా ఉన్నారు. కొద్ది నిమిషాల్లో దాడులు మొదలవుతాయనగా.. ‘నో గో’(వద్దు.. వెళ్లొద్దు) అంటూ ఆదేశాలు అందాయి.. దీంతో దాయాదుల మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కాకుండానే ముగిసింది.

పాక్‌పై దాడి చేసేందుకు వాయుసేన రూపొందించిన సమగ్ర ప్రణాళిక ఇది.. దీన్ని ఎన్డీటీవీ సంపాదించింది. అందులో ఏముందంటే.. ఆ యుద్ధ సమయంలో అప్పటి భారత, పాక్ విదేశాంగ మంత్రులు జశ్వంత్ సింగ్, సర్తాజ్ అజీజ్‌ల మధ్య ఢిల్లీ చర్చలు విఫలమవడంతో  వాయుసేన ‘దాడి’ ప్రణాళిక రూపొందించింది. ‘జూన్ 12న చర్చలు విఫలమై అజీజ్ వెళ్లిపోవడంతో సాయంత్రం 4 గంటలకు పైలట్లను సమావేశపరిచింది.

13న వేకువజామున దాడులు చేయాలని కమాండ్ ఎయిర్ టాస్కింగ్ ఆర్డర్ జారీ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 4 ఎయిర్‌క్రాఫ్ట్‌ల బాంబింగ్ మిషన్.. రావల్పిండిలోని చక్లాలా ఎయిర్ ఫోర్స్ ఎయిర్ బేస్‌లో బీడీఏ (బాంబ్ డ్యామేజ్ అసెస్‌మెంట్) చేయాలని ఆదేశాలు అందాయి’ అని ఎయిర్‌ఫోర్స్ 17 స్క్వాడ్రాన్ డైరీలో  పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement