ట్రంప్‌కు హేపీ బర్త్‌డే చెప్పిన హిందూసేన | Hindusena celebrates Trumps birthday at Jantar Mantar | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు హేపీ బర్త్‌డే చెప్పిన హిందూసేన

Jun 14 2016 3:39 PM | Updated on Aug 25 2018 7:50 PM

ట్రంప్‌కు హేపీ బర్త్‌డే చెప్పిన హిందూసేన - Sakshi

ట్రంప్‌కు హేపీ బర్త్‌డే చెప్పిన హిందూసేన

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ జన్మదిన వేడుకలను దేశ రాజధానిలో హిందూ సేన అంగరంగ వైభవంగా జరుపుకుంది.

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫు అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్ జన్మదిన వేడుకలను భారతదేశ రాజధానిలో హిందూ సేన అంగరంగ వైభవంగా జరుపుకొంది. ట్రంప్ పుట్టినరోజు సందర్భంగా జంతర్ మంతర్ వద్ద ఏర్పాటుచేసిన వేదికపై కేక్ కట్ చేసిన హిందూ సేన ట్రంప్ ఫాలోవర్స్.. ఆయన బ్యానర్ కు కేక్ తినిపించారు.

వేదికను బెలూన్లు, హ్యపీ బర్త్ డే ట్రంప్ అని ఉన్న ప్లకార్డులతో నింపారు. వేదిక పక్కకు ఉన్న ఒక బ్యానర్ లో తుపాకీని చేతితో పట్టుకున్న ట్రంప్ చిత్రాన్ని ఉంచారు. దీనిపై 'హ్యపీ బర్త్ డే అండ్ లాంగ్ లివ్ ట్రంప్' అని రాశారు. పుట్టినరోజు వేడుకల ప్రారంభానికి ముందు హిందూసేన సభ్యులందరూ ఒర్లాండో నరమేధంలో బాధితుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement