పోలీసు కాల్పుల్లో మరో పోలీసు మృతి | head constable dies in police firing | Sakshi
Sakshi News home page

పోలీసు కాల్పుల్లో మరో పోలీసు మృతి

Mar 7 2015 7:40 PM | Updated on Aug 21 2018 7:18 PM

మద్యం మత్తులో ఓ హెడ్‌కానిస్టేబుల్ మరో హెడ్‌కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు.

మద్యం మత్తులో ఓ హెడ్‌కానిస్టేబుల్ మరో హెడ్‌కానిస్టేబుల్‌పై కాల్పులు జరిపాడు. ఖమ్మం జిల్లా సరిహద్దు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ధర్మపేట బేస్‌క్యాంప్‌లో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ధర్మపేట బేస్‌క్యాంప్‌లోని పోలీసులంతా హోలీ వేడుకలు చేసుకుని మద్యం తాగారు.

ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ ఆర్ముడ్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రమేశ్‌ఛత్రీ మరో హెడ్‌కానిస్టేబుల్ అయోధ్యప్రసాద్ దేశ్‌ముఖ్ (45) మధ్య ఘర్షణ తలెత్తింది. తీవ్ర కోపోద్రిక్తుడైన రమేశ్‌ఛత్రీ.. ప్రసాద్‌పై తుపాకీతో కాల్పులు జరపగా అతడు అక్కడికక్కడే మృతిచెందాడని పోలీస్‌వర్గాలు తెలిపాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement