యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి | FIR against IPS officer for clicking pictures of a woman | Sakshi
Sakshi News home page

యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి

May 27 2014 7:12 PM | Updated on Sep 2 2017 7:56 AM

యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి

యువతిని ఫొటోలు తీసిన ఐపిఎస్ అధికారికి దేహశుద్ధి

ఒక కాఫీ షాపులో సీనియర్ ఐపిఎస్ అధికారి ఒకరు తన సెల్తో ఒక యువతిని ఫొటోలు తీశాడు.

బెంగళూరు:  ఒక కాఫీ షాపులో  సీనియర్ ఐపిఎస్ అధికారి ఒకరు తన సెల్తో  ఒక యువతిని ఫొటోలు తీశాడు. దాంతో స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారు. ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుపై అడిషనల్ డైరెక్టర్ జనరల్ పి.రవీంద్రనాథ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఐపిసి 354, 506 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

రవీంద్రనాథ్ అభ్యంతరకరమైన ఫొటోలు తీసినట్లు ఆ యువతి ఫిర్యాదు చేసిందని డిసిపి రవికాంత్ గౌడ్ చెప్పారు. అతనిపై కేసు నమోదు చేశామని, అవసరమైతే అతనిని అరెస్ట్ చేస్తామని చెప్పారు.

ఇదిలా ఉండగా, తాను ఫొటోలు ఏమీ తీయలేదని రవీంద్రనాథ్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement