మహిళను తొక్కి చంపేసిన ఏనుగు | Elephant kills woman in Bengal forest | Sakshi
Sakshi News home page

మహిళను తొక్కి చంపేసిన ఏనుగు

Jul 15 2014 1:52 PM | Updated on Jul 11 2019 6:30 PM

పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి అడవుల్లో ఓ గిరిజన మహిళను ఏనుగు తొక్కి చంపేసింది.

పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి అడవుల్లో ఓ గిరిజన మహిళను ఏనుగు తొక్కి చంపేసింది. ఆమె మృతదేహం మారాఘాట్ రేంజిలో మంగళవారం కనిపించినట్లు అటవీ శాఖాధికారి ఒకరు తెలిపారు.

అడవిలో వంటచెరుకు తెచ్చుకోడానికి నలుగురు మహిళలు కలిసి వెళ్లారని, అప్పుడే వారికి పెద్ద ఏనుగు కనిపించిందని, వాళ్లలో ముగ్గురు ఎలాగోలా తప్పించుకున్నా.. నాలుగో మహిళ మాత్రం బలైపోయిందని డివిజనల్ అటవీ శాఖాధికారి బిద్యుత్ సర్కార్ తెలిపారు. ఇంతకుముందు శుక్రవారం కూడా అలీపుర్దార్ జిల్లాలో కూడా ఓ ఏనుగు ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న ఒక బాలికను తొక్కి చంపేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement