మహిళను తొక్కి చంపేసిన ఏనుగు
పశ్చిమబెంగాల్లోని జల్పాయిగురి అడవుల్లో ఓ గిరిజన మహిళను ఏనుగు తొక్కి చంపేసింది. ఆమె మృతదేహం మారాఘాట్ రేంజిలో మంగళవారం కనిపించినట్లు అటవీ శాఖాధికారి ఒకరు తెలిపారు.
అడవిలో వంటచెరుకు తెచ్చుకోడానికి నలుగురు మహిళలు కలిసి వెళ్లారని, అప్పుడే వారికి పెద్ద ఏనుగు కనిపించిందని, వాళ్లలో ముగ్గురు ఎలాగోలా తప్పించుకున్నా.. నాలుగో మహిళ మాత్రం బలైపోయిందని డివిజనల్ అటవీ శాఖాధికారి బిద్యుత్ సర్కార్ తెలిపారు. ఇంతకుముందు శుక్రవారం కూడా అలీపుర్దార్ జిల్లాలో కూడా ఓ ఏనుగు ఇంటిపై దాడి చేసి, అందులో ఉన్న ఒక బాలికను తొక్కి చంపేసింది.