రైల్లో 8 బాంబులు స్వాధీనం | Eight live bombs recovered in Bihar | Sakshi
Sakshi News home page

రైల్లో 8 బాంబులు స్వాధీనం

Jun 30 2014 3:23 PM | Updated on Sep 26 2018 3:36 PM

సోమవారం కిషన్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైల్లో నుంచి ఎనిమిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు.

పాట్నా: బీహార్లో మరోసారి బాంబుల కలకలం చెలరేగింది. సోమవారం  కిషన్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైల్లో నుంచి ఎనిమిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఓ బోగీలో బాంబులు ఉంచినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వివరించారు. ఎవరికో బాంబులను సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. రైలును లక్ష్యంగా చేసుకుని బాంబులు అమర్చారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement