పీఏలుగా బంధువులు వద్దు: మోడీ | do not entertain relatives as PAs, says narendra modi to ministers | Sakshi
Sakshi News home page

పీఏలుగా బంధువులు వద్దు: మోడీ

May 28 2014 6:16 PM | Updated on Aug 15 2018 2:20 PM

పీఏలుగా బంధువులు వద్దు: మోడీ - Sakshi

పీఏలుగా బంధువులు వద్దు: మోడీ

మంత్రులు ఖర్చులను తగ్గించుకోవాలని, బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పీఏలుగా పెట్టుకోవద్దని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా సూచించారు.

తన కార్యాలయానికి వచ్చే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారాలు కావాలని ప్రధాని కార్యాలయ అధికారులకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టం చేశారు. సమాఖ్య స్ఫూర్తిని పెంపొందించేలా పీఎంఓ నడుచుకోవాలని, రాష్ట్రాల సమస్యలను ప్రాధాన్య క్రమంలో తీర్చాలని ఆయన చెప్పారు.

గతకాలంలో ఉన్న మంచి అంశాలను ఇకపై కూడా కొనసాగిస్తామని మోడీ తెలిపారు. ఇక మంత్రులు ఖర్చులను తగ్గించుకోవాలని, బంధువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పీఏలుగా పెట్టుకోవద్దని స్పష్టంగా సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement