బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్ | dasari narayanarao gets bail in coal scam | Sakshi
Sakshi News home page

బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్

May 22 2015 10:55 AM | Updated on Sep 3 2017 2:30 AM

బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్

బొగ్గు కుంభకోణంలో దాసరికి ముందస్తు బెయిల్

బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ముందస్తు బెయిల్ లభించింది.

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కేంద్ర మాజీ మంత్రి, సినీ దర్శకుడు దాసరి నారాయణ రావుకు ముందస్తు బెయిల్ లభించింది. విచారణ పూర్తయినందున పాటియాల సీబీఐ ప్రత్యేక కోర్టు దాసరి సహా నిందితులందరికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

శుక్రవారం  సీబీఐ ప్రత్యేక కోర్టులో దాసరి నారాయణ రావు, నవీన్ జిందాల్, మధు కోడా హాజరయ్యారు. నిందితులు లక్ష రూపాయల పూచీకత్తు జమచేయడంతో పాటు అనుమతి లేనిదే దేశం విడిచి వెళ్లరాదంటూ న్యాయమూర్తి షరతు విధించారు. అలాగే  సాక్షులను ప్రభావితం చేయరాదని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement