గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత | constable shot dead during night patrolling | Sakshi
Sakshi News home page

గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత

Jan 8 2016 9:38 AM | Updated on Mar 19 2019 5:52 PM

గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత - Sakshi

గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత

పశ్చిమ బెంగాల్లో దారుణం చోటు చేసుకుంది.

మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మిడ్నాపూర్ జిల్లాలోని మహిషాదల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు జాతీయరహదారి 41 వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఘర్షణ మొదలైంది. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ నవకుమార్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా మరోవ్యక్తి తుపాకీ తీసి.. దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. మిగతా పోలీసులు ఏం జరిగిందో తెలుసుకొనే లోపే దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మిడ్నాపూర్ ఎస్పీ, ఏఎస్పీ తదితర ఉన్నతాధికారులు సందర్శించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement