breaking news
Midnapore
-
కూతురి కలను నిజం చేసిన నాన్న!
పిల్లలకు ప్రేమ పంచడంలో తల్లిదండ్రుల తర్వాతే ఎవరైనా. బిడ్డలను కంటిరెప్పలా సాకడంతో పాటు, వారి ఆనందం కోసం ఎంతో శ్రమిస్తుంటారు. పిల్లల కళ్లలో సంతోషం చూడటానికి ఎన్ని ఇబ్బందులనైనా పంటి బిగువున భరిస్తారు. తన గారాలపట్టి ఆనందం కోసం ఓ తండ్రి చేసిన పని ఇప్పుడు పతాక శీర్షికల్లో నిలిచింది.అందరి లాగే బచ్చు చౌదరికి తన కుటుంబమే ప్రపంచం. ముఖ్యంగా కూతురంటే అతడికి ఎనలేని ప్రేమ ఆమె ఏది అడిగినా కాదనడు. అలాగనీ అతడేమి పెద్ద జమీందారు కాదు. అతడో చాయ్ వాలా. పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా (Midnapore District) మౌలా గ్రామంలో ఒక చిన్న టీ స్టాల్ నడుపుతున్నాడు. కొన్నేళ్ల క్రితం స్కూటీ కొనిపెట్టమని తన కూతురు సుష్మ అడిగింది. అంతమాత్రం ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బచ్చుకు బండి కొనడం అంటే కష్టమే అనిపించింది. కానీ కూతురు సంతోషమే తనకు ముఖ్యమని భావించాడు.బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు. ప్రతి రోజు తాను సంపాదించిన మొత్తంలో కొంత మొత్తం పొదుపు చేయడం ప్రారంభించాడు. టీ అమ్మి సంపాదించిన డబ్బు నుంచి రోజూ కొన్ని 10 రూపాయల నాణేలను పక్కన పెట్టేవాడు. వీటిని ఒక పెద్ద ప్లాస్టిక్ డబ్బాలో వేసేవాడు. అతడు ఇలా వరుసగా నాలుగు సంవత్సరాలు పాటు చేశాడు. నాణేలతో డబ్బా నిండిపోవడంతో ఇటీవల దగ్గరలోని టూవీలర్ షోరూమ్‌కు వెళ్లాడు.రూ. 69 వేల నాణేలు!వెంటనే వెళ్లి నాణేలతో కూడిన పెద్ద డబ్బాను షోరూమ్‌కు తెచ్చాడు. డబ్బాలోని నాణేలను నేల మీద పోయగానే... అక్కడున్నవారంతా ఆశ్చర్యంతో నోళ్లు వెళ్లబెట్టారు. నాణేలతో పాటు కొన్ని నోట్లను కూడా బచ్చు పొదుపు చేశాడు. వీటన్నింటిని 8 మంది రెండున్నర గంటల పాటు లెక్కించారు. డబ్బాలోని నాణేలన్ని కలిపి రూ. 69 వేలుగా లెక్క తేలింది. నోట్ల రూపంలో కూడబెట్టింది కూడా కలుపుకుంటే లక్ష రూపాయలు అయ్యాయి. మరో విశేషం ఏంటంటే బచ్చు చౌదరి కూతురు సుష్మ కూడా రూ. 10 వేలు పొదుపు చేసింది.ఆశ్చర్యపోయాంషోరూమ్ ఉద్యోగి అరిందమ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. ''బచ్చు చౌదరి మా దగ్గరికి వచ్చి మొదట స్కూటర్ల ధరల గురించి అడిగారు. నాణేలు తీసుకుంటారా అని అడిగితే, తీసుకుంటామని చెప్పాం. డబ్బా నిండా నాణేలు తెచ్చి మా ముందు పోయడంతో ఆశ్చర్యపోయాం. మా కెరీర్లో ఇలాంటి అనుభవం మాకు ఎప్పుడూ ఎదురు కాలేదు. కూతురి సంతోషం కోసం అతడు చూపించిన అంకిత భావం మమ్మల్ని భావోద్వేగానికి గురి చేసింద''ని అన్నారు.చదవండి: చిన్న కారణాలు.. పెద్ద భయాలుమా కల నెరవేరిందితన కూతురి కోసం స్కూటర్ కొనడం చాలా సంతోషంగా ఉందని బచ్చు చౌదరి తెలిపారు. "నా కూతురు చాలా సంవత్సరాల క్రితం స్కూటర్ (Scooter) అడిగింది. అప్పుడు నేను దానిని కొనలేకపోయాను. కాబట్టి, నేను నాకు వీలైనంత పొదుపు చేయడం ప్రారంభించాను. దీనికి సమయం పట్టింది, కానీ నేను ఆమె కోసం దాన్ని చేశాను. స్కూటర్ కొనుక్కోవాలనేది నా కూతురు కల మాత్రమే కాదు, నాది కూడా. ఇప్పుడు మా కల సాకారమయిందని" బచ్చు తెలిపారు. -
ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన గార్డెన్
మిడ్నాపూర్ : పశ్చిమబెంగాల్లోని మిడ్నాపూర్ డివిజన్ పరిధిలోని పిరకాట రేంజ్‌కు చెందిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పాపన్ మొహంత ప్లాస్టిక్ సీసాలు, రబ్బరు టైర్లను ఉపయోగించి అందమైన గార్డెన్‌ను సృష్టించారు. నాలుగేళ్లుగా ఎంతో కష్టపడి ఈ గార్డెన్‌ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రతిరోజు యధావిధిగా తన విధులను ముగించుకున్న తర్వాత పిరాటక రేంజ్లో ఉన్న ఖాళీ స్థలంలోనే గార్డెన్ పెంపకాన్ని చేపట్టినట్లు మొహంత తెలిపారు. ''తాను మొదటిసారి పోస్టింగ్‌పై పిరాటక రేంజ్‌కు వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం వ్యర్థాలతో నిండిపోవడం చూశాను. ఎలాగైనా దీన్ని ఒక అందమైన ప్రదేశంగా తయారు చేయాలని నిశ్చయించుకున్నాను. మొత్తం 1100 ప్లాస్టిక్ బాటిళ్లు, పాడైపోయిన రబ్బర్ ట్యూబ్‌లతో గార్డెన్‌ను తయారు చేశాను. గార్డెన్‌ను సందర్శించిన వారు అభినందించడం తన కష్టాన్ని మరిచిపోయేలా చేసిందని'' మెహంతా చెప్పుకొచ్చారు. గార్డెన్లో రకరకాల సీజనల్ పూల మొక్కల్ని ఏర్పాటు చేసినట్లు మెహంతా తెలిపారు. దీన్ని సందర్శించిన సమీపంలోని పాఠశాలలు, సీఆర్పీఎఫ్ జవాన్లు ఇదే తరహాలో గార్డెన్లు ఏర్పాటు చేయడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘భవిష్యత్తులో భుమికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్లాస్టిక్ ఉత్పత్తుల్ని ఉపయోగించి ఇలాంటి కార్యక్రమాలను చేపడితే కొంతవరకైనా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. తాను చేసిన ఈ ప్రయత్నాన్ని సామాజిక బాధ్యతతో పాఠశాలు, ఇతర మార్గాల ద్వారా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాను’ అని మొహంత తెలిపారు. -
మోదీ ఆటోగ్రాఫ్.. మ్యారేజ్ ప్రపోజల్స్ వెల్లువ
రాణిబంద్, పశ్చిమబెంగాల్ : ఇటీవల మిద్నాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ సభలో టెంట్ కూలి 90 మంది ప్రజలు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో రీటా మూడి అనే 19 ఏళ్ల యువతి కూడా గాయాలపాలైంది. కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించేందుకు మోదీ స్వయంగా ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో రీటా మూడి.. మోదీని ఆటోగ్రాఫ్ ఇవ్వాల్సిందిగా కోరింది. ‘దేవుడు నిన్ను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేలా చేస్తాడు’.. మీరంతా త్వరగా కోలుకోవాలి అని ఆశిస్తూ మోదీ రీటాకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ట్విటర్లో పోస్ట్ చేయడంతో.. చుట్టు పక్కల గ్రామాల్లో రీటా సెలబ్రిటీగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి రీటా, ఆమె కుటుంబంతో సెల్ఫీలు దిగేందుకు చుట్టు పక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలు తరలివస్తున్నారు. కొంత మందైతే ఏకంగా ఇప్పటికిప్పుడే రీటాను తమ ఇంటి కోడలిగా చేసుకుంటామంటూ పెళ్లి ప్రస్తావన కూడా తీసుకు వస్తున్నారు. రీటాతో పాటుగా.. ఆమె చెల్లి అనితకు కూడా పెళ్లి సంబంధాలు వెల్లువెత్తడంతో చదువు పూర్తైన తర్వాతే ఆ విషయం గురించి ఆలోచిస్తామంటూ సమాధానమిస్తున్నారు ఈ అక్కా చెల్లెళ్లు. ఆస్పత్రిలో రీటాకు ఆటోగ్రాఫ్ ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
పరిస్థితి దారుణంగా ఉంది
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత ఘటనపై బీజేపీ స్పందించింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు బాధ కలిగిస్తున్నాయని విమర్శించింది. శాంతిభద్రతల పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తోందని ఆ పార్టీ నేత నళిన్ కోహ్లీ ఆరోపించారు. తక్షణమే పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా మిడ్నపూర్ జిల్లాలో గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఎన్‌హెచ్ 41 వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నిస్తున్నక్రమంలో దుండగులు కాల్పులుకు తెగబడ్డాడు. ఈ ఘర్షణలో కానిస్టేబుల్ నవకుమార్ ప్రాణాలు కోల్పోయాడు. సంఘటనా స్థలాన్ని మిడ్నాపూర్ ఎస్పీ, ఏఎస్పీ తదితర ఉన్నతాధికారులు సందర్శించారు. పరిస్థితిని సమీక్షిస్తున్నారు. -
గస్తీలో ఉన్న కానిస్టేబుల్ కాల్చివేత
మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్లో దారుణం చోటుచేసుకుంది. గురువారం రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. మిడ్నాపూర్ జిల్లాలోని మహిషాదల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రిపూట గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు జాతీయరహదారి 41 వద్ద బ్యాగులతో అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా ఘర్షణ మొదలైంది. ఓ వ్యక్తిని కానిస్టేబుల్ నవకుమార్ అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా మరోవ్యక్తి తుపాకీ తీసి.. దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. మిగతా పోలీసులు ఏం జరిగిందో తెలుసుకొనే లోపే దుండగులు అక్కడ నుంచి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని మిడ్నాపూర్ ఎస్పీ, ఏఎస్పీ తదితర ఉన్నతాధికారులు సందర్శించారు. దుండగుల కోసం గాలిస్తున్నారు. -
ఉద్యోగినిపై ఆస్పత్రి యజమాని అత్యాచారం
మిడ్నాపూర్: యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ పశ్చిమబెంగాల్ మిడ్నాపూర్ లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఉద్యోగిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత ఏడేనిమిదేళ్లు యాజమాని తనపై అత్యాచారానికి ఒడిగట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఆమెను మంగళవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆస్పత్రిలో సీసీటీవీ పుటేజీని పోలీసులు పరిశీలించారు. యాజమాని వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యాలు లభించలేదు. తన చాంబర్ లో అతడు మహిళతో కలిసివున్నట్టు వీడియోలో ఎక్కడా కనబడలేదని పోలీసులు తెలిపారు.


