కరోనాపై భయాలొద్దు

Congress chief Sonia Gandhi urges people not to panic - Sakshi

కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి భయాందోళనలకు గురి కావద్దని కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా గాంధీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాధి ప్రభావానికి గురైన అన్ని రంగాలకు సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. వైరస్‌ నిర్ధారణ పరీక్షా కేంద్రాల సంఖ్యను పెంచాలని, వీటితోపాటు చికిత్స అందించే ఆస్పత్రుల వివరాలను ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఉంచాలన్నారు. ఈ వ్యాధిపై పోరాటానికి మరిన్ని నిధులు అందుబాటులోకి తేవాలని సూచించారు. ‘అసంఘటిత రంగాలకు చెందిన తాత్కాలిక ఉద్యోగులు, కార్మికులు, రైతులకు ఆర్థిక సాయం ప్రకటించాలి. దెబ్బతిన్న వివిధ రంగాల వారీగా సమగ్రమైన సహాయ ప్యాకేజీని ప్రభుత్వం అందించాలి’ అని సోనియా కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top