ట్రక్కు-హార్వెస్టర్‌ ఢీ: నలుగురి మృతి | collision between harvester and truck in MP | Sakshi
Sakshi News home page

ట్రక్కు-హార్వెస్టర్‌ ఢీ: నలుగురి మృతి

Mar 6 2017 6:40 PM | Updated on Aug 30 2018 4:10 PM

హార్వెస్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో నలుగురు మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బుర్హాన్‌పూర్‌: మధ్యప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హార్వెస్టర్‌ను ట్రక్కు ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నింబోల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అస్సర్గర్‌ గ్రామ సమీపంలో ఇండోర్‌-ఇచ్చాపూర్‌ హైవేపై చోటు చేసుకుంది.  క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు.
 
మృతుల్లో ఇద్దరిని వారి డాక్యుమెంట్ల ఆధారంగా ఇండోర్‌కు చెందిన జగదీశ్‌ అహిర్వార్‌, విడిషాకు చెందిన ధీరజ్‌ బల్ముకుంద్‌లుగా గుర్తించామని, మరో ఇద్దరి గురించి ఎలాంటి వివరాలు తేలియలేదని బుర్హాన్‌పూర్‌ ఎస్పీ పరిహార్‌ మీడియాకు తెలియజేశారు

Advertisement
 
Advertisement
Advertisement