
ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌పార్టీతో టీడీపీ పొత్తుల కోసం ఆరాటపడుతోంది.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వ్యతిరేకతలో నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అదే పార్టీతో చేతులు కలిపింది. ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన కాంగ్రెస్‌పార్టీతో టీడీపీ పొత్తుల కోసం ఆరాటపడుతోంది. చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీలతో కలిసి ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతో గురువారం చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
పొత్తు విషయంలో గతంలో ఏం జరిగిందన్నది తాము ఆలోచించడం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ముందుకెళ్లాలనే దానిపైనే ఆలోచన చేస్తున్నాని తెలిపారు. దేశ భవిష్యత్తు కోసం కలిసి పని చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అని చెప్పారు.
కాంగ్రెస్‌తో తాము చేతులు కలుపుతున్నామని చంద్రబాబు అన్నారు. తనకు 40 ఏళ్ల అనుభవం ఉందన్నారు. వ్యవస్థలను కేంద్రం నాశనం చేస్తోందని, బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తామని చంద్రబాబు తెలిపారు.