మాజీ సీఎం కుమార్తెపై కేసు | Case against Bihar ex-CM's daughter, others | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం కుమార్తెపై కేసు

Dec 21 2015 3:59 PM | Updated on Sep 3 2017 2:21 PM

మాజీ సీఎం కుమార్తెపై కేసు

మాజీ సీఎం కుమార్తెపై కేసు

బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ కుమార్తె సునైనా దేవిపై కేసు నమోదైంది.

పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి జీతన్ రామ్ మాంజీ కుమార్తె సునైనా దేవిపై కేసు నమోదైంది. గయ జిల్లాలో సునైనా దేవి కోడలు సోని అనుమానాస్పద మృతికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు.

సునైనాతో పాటు మరో నలుగురు కుటుంబ సభ్యులపై సోని తండ్రి రామ్దేవ్ మాంజి కేసు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. వరకట్నం కోసం సునైనా దేవి కుటుంబ సభ్యులు తన కుమార్తెను హత్య చేశారని రామ్దేవ్ మంజి ఆరోపించారు. తమకు చెప్పకుండా తన కుమార్తెకు అంత్యక్రియలు చేశారని చెప్పారు. 2008లో సునైనా కొడుకు విక్కీతో తన కుమార్తె వివాహం జరిగిందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement