మధ్యప్రదేశ్ ‘స్థానికం’లో హస్తం హవా | BJP defeat in mahya pradhesh | Sakshi
Sakshi News home page

మధ్యప్రదేశ్ ‘స్థానికం’లో హస్తం హవా

Dec 27 2015 2:40 AM | Updated on Mar 29 2019 9:31 PM

మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకోగా..

భోపాల్: మధ్యప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుగాలి వీచింది. ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఐదింటిని గెలుచుకోగా.. బీజేపీ మూడింటితో సరిపెట్టుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లాతో పాటు మరో రెండు స్థానాల్లో మాత్రమే కమలం గెలిచింది. ఈ విజయంలో కాంగ్రెస్‌లో ఉత్సాహం పెరిగింది. భోపాల్‌లోని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం తగ్గిందని.. ప్రజలకు మళ్లీ కాంగ్రెస్‌పై నమ్మకం కలుగుతోందని కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement