
అసలు అమిత్ షా ఎవరు?
బీహార్ బీజేపీ సీనియర్ నేత, బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ తమ పార్టీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డాడు.
బిహార్ బీజేపీ సీనియర్ నేత, బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ తమ పార్టీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డాడు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్ నేతలు ఓటమికి వివరణ ఇవ్వాలని కోరుతుండగా.. బోలా సింగ్ అదేబాటలో నడిచాడు. 'అసలు అమిత్ షా ఎవరు? మా అధికారాన్ని అప్పగిస్తే అమిత్ షా, ప్రధాని అక్కడ ఉన్నారు. ఓటమికి అమిత్ షా వివరణ ఇవ్వాలి లేదా పార్టీ అధ్యక్ష పదవినుండి వైదోలగాలి' అని ఆయన డిమాండ్ చేశాడు.
రిజర్వేషన్లకు వ్యతికరేకంగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఫలితాలపై ప్రభావం చూపలేదన్న వివరణను భోలా సింగ్ ఖండించారు. భగవత్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపు అవకాశాలపై వడగండ్ల వానలా పడ్డాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యవహరించిన తీరును సైతం ఆయన విమర్శించారు. ఓ స్థానిక నేతలా లాలూ కుమార్తె, నితీష్ డీఎన్ఏపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రచారంలో అమిత్ షా చేసిన పాకిస్థాన్లో టపాసులు కాలుస్తారనే కామెంట్స్ సైతం పార్టీ ఓటమికి కారణమయ్యాయని బోలాసింగ్ ఆక్షేపించారు.