breaking news
bhola singh
-
మోదీని ఇరుకున పెట్టిన బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ భోలా సింగ్ బుధవారం లోక్ సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ భారత దేశానికి బుద్ధి లేదని ఆయన కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టిన 'స్మార్ట్ సిటీస్' పథకంపై మాట్లాడుతూ ఆయన ఈ మాటలు అన్నారు. 'స్మార్ట్ సిటీస్' పథకం అభివృద్ధి చెందిన నగరాలకే ఉపయోగపడుతుందని, ప్రాంతీయ అసమానతలు తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ఉండగానే సొంత పార్టీని ఏకీపారేశారు. 'ఈశాన్య భారత్ లో అభివృద్ధి లేదు. ఎందుకంటే అక్కడ వివేకం ఉంది. పశ్చిమ భారత్ లో అభివృద్ధి ఉంది కానీ వివేకం లేద'ని ఆయన వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాల్లో 'బ్రెయిన్స్' ఉన్నాయి కానీ అభివృద్ధి లేదని ప్రధాని మోదీ గతంలో అన్న మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సింగ్ వ్యాఖ్యలతో మోదీ ఇరుకున పడ్డారు. అయితే మోదీ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ వివేకవంతులు ఉన్నారని చెప్పారు. భోలా సింగ్ వ్యాఖ్యలతో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఏకీభవించడం విశేషం. బిహార్ లోని బెగుసరాయ్ నియోజకవర్గానికి భోలా సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
అసలు అమిత్ షా ఎవరు?
బిహార్ బీజేపీ సీనియర్ నేత, బెగుసరాయి ఎంపీ భోలా సింగ్ తమ పార్టీ అగ్రనాయకత్వంపై విరుచుకుపడ్డాడు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఓటమితో ఇప్పటికే పలువురు పార్టీ సీనియర్ నేతలు ఓటమికి వివరణ ఇవ్వాలని కోరుతుండగా.. బోలా సింగ్ అదేబాటలో నడిచాడు. 'అసలు అమిత్ షా ఎవరు? మా అధికారాన్ని అప్పగిస్తే అమిత్ షా, ప్రధాని అక్కడ ఉన్నారు. ఓటమికి అమిత్ షా వివరణ ఇవ్వాలి లేదా పార్టీ అధ్యక్ష పదవినుండి వైదోలగాలి' అని ఆయన డిమాండ్ చేశాడు. రిజర్వేషన్లకు వ్యతికరేకంగా ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు ఫలితాలపై ప్రభావం చూపలేదన్న వివరణను భోలా సింగ్ ఖండించారు. భగవత్ వ్యాఖ్యలు బీజేపీ గెలుపు అవకాశాలపై వడగండ్ల వానలా పడ్డాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో మోదీ వ్యవహరించిన తీరును సైతం ఆయన విమర్శించారు. ఓ స్థానిక నేతలా లాలూ కుమార్తె, నితీష్ డీఎన్ఏపై వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రచారంలో అమిత్ షా చేసిన పాకిస్థాన్లో టపాసులు కాలుస్తారనే కామెంట్స్ సైతం పార్టీ ఓటమికి కారణమయ్యాయని బోలాసింగ్ ఆక్షేపించారు. -
'అమిత్ షా తప్పుకోవాలి'
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా బాధ్యులని బీజేపీ ఎంపీ బోలా సింగ్ పునురుద్ఘాటించారు. పార్టీ ఓటమికి గల కారణాలపై అమిత్ షా వివరణ ఇవాలని లేదా అధ్యక్ష పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. బిహార్ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలపై అగ్రనేతలే నిర్ణయం తీసుకున్నారని, ఓటమికి వారే బాధ్యత వహించాలని బెగుసరాయ్ లోక్ సభ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న బోలా సింగ్ అన్నారు. 'బీజేపీకి కేన్సర్ సోకింది. దీన్ని నిర్మూలించాల్సిన అవసరముంది' అని పేర్కొన్నారు. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యల ప్రభావం బిహార్ ఎన్నికల్లో లేదని చెప్పడాన్ని ఆయన తోసిపుచ్చారు.