వెబ్‌సైట్‌లో ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ | Avengers Endgame Leaked Online by Tamilrockers | Sakshi
Sakshi News home page

వెబ్‌సైట్‌లో ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’

Apr 26 2019 3:42 AM | Updated on Apr 26 2019 3:42 AM

Avengers Endgame Leaked Online by Tamilrockers - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇంతకాలం భారతీయ చిత్రాలకే పరిమితమైన తమిళ పైరసీ రాకర్స్‌ హాలీవుడ్‌పైనా పంజా విసిరారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ హాలీవుడ్‌ చిత్రాన్ని గురువారం వెబ్‌సైట్‌లో పెట్టేశారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమయ్యే తమిళ చిత్రాలను అత్యంత సులువుగా పైరసీ ద్వారా విడుదల చేస్తూ తమిళ సినీ నిర్మాతలకు తమిళ రాకర్స్‌ ఇప్పటి దాకా గుబులు పుట్టించారు. తాజాగా, వేలాది కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొంది, ఈ నెల 26న విడుదల కావాల్సిన ‘అవెంజర్స్‌ ఎండ్‌ గేమ్‌’ను సైతం తమిళ రాకర్స్‌ వదిలిపెట్టలేదు.

Advertisement
 
Advertisement
Advertisement