‘సంకల్ప్‌ పర్వం’గా ఆగస్టు 15 | August 15 to be celebrated as 'Sankalp Parva': Government | Sakshi
Sakshi News home page

‘సంకల్ప్‌ పర్వం’గా ఆగస్టు 15

Aug 8 2017 8:15 AM | Updated on Jul 12 2019 4:35 PM

దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న ‘సంకల్ప్‌ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది.

న్యూఢిల్లీ: దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న ‘సంకల్ప్‌ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషి చేస్తామని పౌరులు ఆరోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ నెల 15న ‘సంకల్ప్‌ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తన తాజా ఉత్తర్వులో పేర్కొంది.

‘2022నాటికి క్విట్‌ఇండియా ఉద్యమం 75ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. పౌరులంతా సమష్టిగా సమస్యలపై పోరాడి కొత్త భారతావనిని ఆవిష్కరిస్తే మన స్వాతంత్య్రయోధులు గర్విస్తారు’ అని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement