
ఆటో డీలర్ల సమాఖ్య ఫాడా వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయ వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో స్వల్పంగా 3% పెరిగాయని వాహన డీలర్ల సమాఖ్య ( ఫాడా) గణాంకాలు వెల్లడించింది. మొత్తం ఆగస్టులో 19,64,547 వాహన రిజి్రస్టేషన్లు కాగా, 2024 ఆగస్టులో ఇవి 19,10,312గా ఉన్నాయని ఫాడా తెలిపింది.
జీఎస్‌టీ అమల్లోకి వస్తే ధరలు దిగి వస్తాయని కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడంతో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పేర్కొంది. ‘‘వేచి చూసే ధోరణి కారణంగా సెపె్టంబర్ ప్రథమార్థమంతా అమ్మకాలు అంతంత మాత్రమే ఉండొచ్చు. జీఎస్‌టీ విధానంపై స్పష్టత, పండుగ సెంటిమెంట్‌తో ఈ నెల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ఉండొచ్చు’’ అని ఫాడా అంచనా వేసింది.
→ ప్యాసింజర్ విక్రయాలు గతేడాది ఆగస్టుతో పోలిస్తే 3,20,291 యూనిట్ల నుంచి స్వల్పంగా 0.93% పెరిగి 3,23,256 కు చేరాయి. మెరుగైన ఎంక్వైరీలు, పండుగ బుకింగ్స్‌తో ఆగస్టు ప్రథమార్థమంతా సానుకూల ధోరణి కని్పంచింది. అయితే ఆగస్టు 15న ప్రధాని జీఎస్‌టీ సంస్కరణ ప్రకటనతో కస్టమర్లు కొనుగోళ్లు వాయిదా వేసుకున్నారని ఫాడా తెలిపింది.
→ ద్వి చక్ర వాహనాల రిజి్రస్టేషన్లు 2.17% పెరిగాయి. ఈ ఆగస్టులో మొత్తం 13,73,675 అమ్మకాలు జరిగాయి. గతడాది ఇదే నెలలో విక్రయాలు 13,44,380 యూనిట్లుగా ఉన్నాయి. ఈ విభాగపు ఎంక్వైరీలు ఇప్పట్టకీ బలంగా ఉన్నాయి. ఓనమ్, గణేశ్ చతుర్థి పండుగ ప్రారంభంతో చాలా మంది కస్టమర్లు డెలివరీల కోసం ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఉత్తర భారతదేశంలో అధిక వర్షాలు, వరదలు గ్రామీణ రాకపోకలకు అంతరాయంతో అమ్మకాలపై ప్రభావాన్ని చూపాయి.
→ వాణిజ్య వాహన రిటైల్ విక్రయాలు ఆగస్టులో 69,635 యూనిట్ల నుంచి 8.55% పెరిగి 75,592 యూనిట్లకు చేరుకున్నాయి. త్రీవీలర్ రిటైల్ అమ్మకాలు 1,05,493 యూనిట్ల నుంచి 2% తగ్గి 1,03,105కు దిగివచ్చాయి.