లాక్‌డౌన్‌ లేనట్టే ! | Arvind Kejriwal Says No Lockdown Plans In Delhi | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించబోం’

Jun 15 2020 3:02 PM | Updated on Jun 15 2020 3:19 PM

Arvind Kejriwal Says No Lockdown Plans In Delhi - Sakshi

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదన్న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌

సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. దేశ రాజధానిలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారన్న ఊహాగానాలను ఆయన తోసిపుచ్చారు. ఢిల్లీలో వైరస్‌ కట్టడిపై చర్చించేందుకు హోంమంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం దేశ రాజధానిలో​ మరోసారి లాక్‌డౌన్‌ విధించే ఉద్దేశం లేదని కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ఢిల్లీలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారని చాలా మంది ఊహిస్తున్నారని..కానీ అలాంటి ప్రణాళికలేమీ లేవని కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. కాగా దేశరాజధాని ఢిల్లీలో ఇప్పటివరకూ 41,000కు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదవగా 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

చదవండి  : ప్రతీ ముగ్గురిలో ఒకరికి వైరస్‌..!

Advertisement
 
Advertisement
Advertisement