‘నిందితులను కాపాడే చర్య!’ | 'Action to protect the guilty!' | Sakshi
Sakshi News home page

‘నిందితులను కాపాడే చర్య!’

Oct 14 2014 12:23 AM | Updated on Sep 2 2017 2:47 PM

బొగ్గు కుంభకోణంలో కమల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును ముగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, ...

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో కవుల్ స్పాంజ్ స్టీల్ సంస్థపై కేసును వుుగిస్తూ సీబీఐ ఇచ్చిన నివేదికను ఢిల్లీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు గందరగోళంగా ఉందని, మూసివేత నిర్ణయం సరికాదని పేర్కొంది. ఈ కేసులో తమ ఎదుట హాజరుకావాలంటూ బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి గుప్తాతో పాటు మరో ఐదుగురికి సమన్లు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కమల్  సంస్థతో పాటు ఆ సంస్థ ఉద్యోగులు, పలువురు బొగ్గు శాఖ అధికారులపై పెట్టిన కేసును మూసివేయాలని సీబీఐ నిర్ణయించి కోర్టుకు నివేదిక అందజేసింది.

దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి భరత్ పరాశర్.. కేసు మూసివేత సరికాదంటూ నివేదికను తిరస్కరించారు. ఈ కేసులో నిందితులను కాపాడే తరహాలో సీబీఐ చర్యలు ఉన్నాయన్నారు.  సరైన మానవ వనరులు లేని కారణంగా బొగ్గు శాఖ అధికారులు కమల్  దరఖాస్తుపై స్క్రూటినీ నిర్వహించలేకపోయారనడం సరికాదన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement