సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి | 29 telangana people were free from Saudi | Sakshi
Sakshi News home page

సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి

Mar 31 2017 4:12 AM | Updated on Aug 30 2019 8:24 PM

సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి - Sakshi

సౌదీ నుంచి 29 మంది తెలంగాణవాసులకు విముక్తి

సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 29 మంది తెలంగాణవాసులను కాపాడినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు.

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన 29 మంది తెలంగాణవాసులను కాపాడినట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ తెలిపారు. ‘సౌదీ అరేబియాలో బందీలుగా ఉన్న 29 మంది భారతీయులను కాపాడాం. వారి విమాన ఖర్చులను కూడా మేమే భరిస్తాం’ అని మంత్రి గురువారం రాత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ఈ విషయంపై సుష్మా స్వరాజ్‌ జోక్యం చేసుకోవాలని ఇటీవలే లేఖ రాశారు.

సౌదీ అరేబియాలోని ఓ కంపెనీలో వీరిని నిర్బంధిం చారని, భోజనం, నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్‌ అక్కడి భారత ఎంబసీ అధికారులతో మాట్లాడి బాధితుల విడుదలకు చొరవతీసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement