గంగావతరణం రోజున 27 మంది జలసమాధి | 27 drown in Ganga | Sakshi
Sakshi News home page

గంగావతరణం రోజున 27 మంది జలసమాధి

Jun 9 2014 1:37 PM | Updated on Sep 2 2017 8:33 AM

గంగావతరణం పండుగ సందర్భంగా తల్లి గంగమ్మను పూజించడానికి వెళ్లిన 27 మంది ఉత్తరప్రదేశ్ లో జలసమాధి అయిపోయారు.

గంగావతరణం పండుగ సందర్భంగా తల్లి గంగమ్మను పూజించడానికి వెళ్లిన 27 మంది ఉత్తరప్రదేశ్ లో జలసమాధి అయిపోయారు. దివి నుంచి గంగానది భువికి దిగిన రోజు కావడంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది గంగా స్నానాలు చేశారు. ఈ సందర్భంగా జరిగిన వేర్వేరు ప్రమాదంలో రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది నదిలో మునిగి చనిపోయారు. 
 
మరో తొమ్మిది మంది ఆచూకీ తెలియలేదు. గజ ఈతగాళ్లు ముగ్గురిని కాపాడారు. ఈ ప్రమాదాలు బదాయూ, బెలాదండీ, మథుర, కాస్ గంజ్, ఆగ్రా జిల్లాలో జరిగాయి.

Advertisement
 
Advertisement
Advertisement