రెండు వర్గాల మధ్య ఘర్షణ: 15 మందికి గాయాలు | 15 injured in clash between two communities in northwest Delhi | Sakshi
Sakshi News home page

రెండు వర్గాల మధ్య ఘర్షణ: 15 మందికి గాయాలు

Jan 31 2016 10:23 AM | Updated on Sep 3 2017 4:42 PM

రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో అల్లర్లలో 15 మందికి గాయాలయ్యాయి.

ఢిల్లీ: రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో అల్లర్లలో 15 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన వాయువ్య ఢిల్లీలోని సంగం పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఒక వర్గానికి చెందిన యువకుడు మరో వర్గానికి చెందిన వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో గొడవ ప్రారంభమైందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. దీంతో వెంటనే ఇద్దరికి సంబందించిన గ్రూపులు ఒకే చోటకు చేరడంతో ఘర్షణ జరిగిందన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. శనివారం అర్ధరాత్రి సమయం నుంచి ఘర్షణ జరిగిన ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

Advertisement
 
Advertisement
Advertisement