సమ్మర్‌లో ‘జోంబీ’ | Yogi Babu Zombie Wrapped Up Release Date to be Announced Soon | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో ‘జోంబీ’

Apr 7 2019 4:13 PM | Updated on Apr 7 2019 4:13 PM

Yogi Babu Zombie Wrapped Up Release Date to be Announced Soon - Sakshi

చిన్న చిన్న పాత్రలతో కమెడియన్‌గా ఎదిగిన నటుడు యోగిబాబు ఇప్పుడు కథానాయకుడి స్థాయికి చేరుకున్నాడు. ఒక పక్క హాస్యనటుడిగా బిజీగా ఉన్నా, మరో పక్క తన కోసమే తయారు చేసిన కథా చిత్రాల్లో హీరోగా నటిస్తున్నాడు. అలా యోగిబాబు నటిస్తున్న తాజా చిత్రాల్లో జోంబీ ఒకటి. ఇందులో నటి యాషిక నాయకిగా నటిస్తోంది.

ఈ చిత్రానికి యువన్‌ నలన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ జోంబీ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తి అయ్యిందని చెప్పారు. చిత్ర షూటింగ్‌ అధిక భాగం చెన్నై, వీసీఆర్‌ రోడ్డులోని ఒక గెస్ట్‌హౌస్‌లో నిర్వహించినట్లు తెలిపారు. ప్రేమ్‌జీ అమరన్‌ సంగీతాన్ని అందించిన చిత్రాన్ని సమ్మర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర కథ చెన్నై, వీసీఆర్‌ రోడ్డు, పాండిచ్చేరిలలో ఒకే రాత్రి జరిగే సంఘటన ఇతివృత్తంగా ఉంటుందని చెప్పారు. దీన్ని ఎస్‌ 3 పిక్చర్స్‌ పతాకంపై ఆర్‌.వసంత్‌ మహాలింగం, వి.ముత్తుకుమార్‌ నిర్మిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement