వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్‌ | Yatra Team Meets YS Jagan | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ‘యాత్ర’ టీమ్‌

Feb 9 2019 5:48 PM | Updated on Feb 9 2019 8:30 PM

Yatra Team Meets YS Jagan - Sakshi

ప్రేక్షకాదరణ పట్ల జగనన్న సంతోషం వ్యక్తం..

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుంచే సినిమాకు విశేష ప్రేక్షకాదరణ లభించడంతో చిత్ర యూనిట్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో యాత్ర టీమ్‌ శనివారం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్‌ చల్లాలు వైఎస్‌ జగన్‌ను కలిసారు. ఈ భేటీ అనంతరం దర్శకుడు రాఘవ మీడియాతో మాట్లాడారు. సినిమాకు వచ్చిన హిట్‌ టాక్‌ గురించి వైఎస్‌ జగన్‌ అడిగి తెలుసుకున్నారని, చిత్రంపై వస్తున్న ప్రేక్షకాదరణ పట్ల సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. జనాలు ఫోన్‌ చేసి చిత్రంపై ఫీడ్‌బ్యాక్‌ ఇస్తుంటే తనకు మాటలు రావడం లేదని ఆనందం వ్యక్తం చేశారు. (గర్వంగా ఉంది : ‘యాత్ర’ దర్శకుడు)

ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరూ రాజన్నను గుర్తుకు తెచ్చుకుని.. నాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయామని..‘యాత్ర’ సినిమా కాదు.. మహానాయకుడి జీవితం.. రాజన్న వ్యక్తిత్వానికి నిలువుటద్దం.. ఇచ్చిన మాటకు కట్టుబడేందుకు ఎంత దూరమైన వెళ్లేందుకు సిద్దమయ్యే రాజన్న తెగువ, ధైర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించారని, సినిమా చూస్తున్నంత సేపు రాజన్నను చూస్తున్నట్టే ఉందని  రాజన్నకు యాత్ర ఘన నివాళి అంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. (చదవండి: యాత్ర’ మూవీ రివ్యూ)

Advertisement
 
Advertisement
Advertisement