రానా, మిహీక ప్రేమ చిగురించింది అక్క‌డే! | Where Did Rana Miheeka Bajaj First Meet | Sakshi
Sakshi News home page

రానా, మిహీక ప్రేమ చిగురించింది అక్క‌డే!

May 14 2020 12:10 PM | Updated on May 14 2020 3:13 PM

Where Did Rana Miheeka Bajaj First Meet - Sakshi

త‌న ప్రేమ విష‌యాన్ని వెల్ల‌డించి అభిమానుల‌కు స‌ర్‌ప్రైజ్ చేశాడు హీరో రానా ద‌గ్గుబాటి. వ్యాపార‌వేత్త  మిహీకా బ‌జాజ్‌తో ‌ప్రేమ‌లో ఉన్న‌ట్లు ‘భళ్లాలదేవుడు’ కుండ‌బ‌ద్దలు కొట్టాడు. అన్ని విష‌యాల్లో గోప్య‌త పాటించే రానా ఒకేసారి త‌న ప్రేయ‌సిని ప్ర‌పంచానికి చూపించ‌డంతో అభిమానులు షాక్‌కు గుర‌వుతు‌న్నారు. ఇక రెండు రోజుల నుంచి రానా ప్రేమ వ్య‌వ‌హారం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రానా ఒక ఇంటివాడు కాబోతున్నాడ‌ని తెలిసిన వెంట‌నే ప్ర‌ముఖులంతా విషెస్ చెబుతున్నారు. అయితే రానా, మిహీకకు మ‌ధ్య‌ ప్రేమ ఎక్క‌డ చిగురించిందా అని అభిమానులు ఆలోచ‌న‌లో ప‌డిపోయారు. ఇద్ద‌రు హైద‌రాబాద్‌కు చెందిన‌ప్ప‌టికీ వీరి ల‌వ్ ట్రాక్ ఏర్ప‌డ‌టానికి కార‌ణం ముంబై అని తెలుస్తోంది. (కుటుంబంలోకి స్వాగతం రానా: హీరోయిన్‌)

సన్నిహితుల సమాచారం ప్రకారం.. ముంబైలో జ‌రిగిన ఓ బాలీవుడ్ పార్టీలో వీరిద్దరు మొద‌ట క‌లుసుకున్నారట. అలా క‌లిసిన రానా, మిహీకా ప‌రిచ‌యం నేడు వివాహ బంధానికి దారితీసింది. దీనిపై స్పందించిన రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు.. ఈ ఏడాదిలోనే రానా పెళ్లి పీట‌లు ఎక్కనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇక ద‌గ్గుబాటి వార‌సుడి పెళ్లి బాజాలు త్వ‌ర‌లో మోగ‌నున్న‌న్నాయి. మిహీకా బజాజ్ విషయానికొస్తే.. ఆమెది హైదరాబాద్. ప్రస్తుతం ‘డ్యూ డ్రాప్ స్లూడియో’ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తోంది. (‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’)

Advertisement
 
Advertisement
Advertisement