మా కుటుంబంలోకి స్వాగతం రానా: సోనం కపూర్‌

Sonam Kapoor Friend Of Mihika Bajaj Welcomes Rana To The Family - Sakshi

‘‘డార్లింగ్‌ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్‌ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ బాలీవుడ్‌ ఫ్యాషన్‌ దివా సోనం కపూర్‌.. ప్రేమజంట రానా దగ్గుబాటి, మిహిక బజాజ్‌కు అభినందనలు తెలిపారు. తన స్నేహితురాలి చేయి అందుకోబోతున్న రానాను తమ స్నేహ బృందంలోకి ఆహ్వానించారు. కాగా తన ప్రేమకు మిహిక బజాజ్‌ ఓకే చెప్పిందంటూ హీరో రానా దగ్గుబాటి సోషల్‌ మీడియాలో ఆమెతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ రానా త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడంటూ సినీ సెలబ్రిటీలు సహా అభిమానులు అతడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.(రానా ప్రేయసి మిహీక వివరాలు ఇవే.. )

ఇక ఈ జాబితాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ సోనమ్‌ కపూర్‌ కూడా చేరిపోయారు. కాగా మిహిక, సోనం మంచి స్నేహితులు. ఒకరికి సంబంధించిన వేడుకలో మరొకరు సందడి చేస్తూ.. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకుంటారు. ప్రస్తుతం రానా, మిహికల రిలేషన్‌షిప్‌ హాట్‌టాపిక్‌గా మారడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు సోనం.. మిహికను విష్‌ చేయడంతో.. గతంలో వారిద్దరు కలిసి దిగిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. సోనం కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా మిహిక షేర్‌ చేసిన ఓ ఫొటో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అదే విధంగా సోనం మెహందీ సమయంలో మిహిక సందడి చేసిన దృశ్యాలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. కాగా హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన మిహిక.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదిగి డ్యూ డ్రాప్‌ పేరిట ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీని నిర్వహిస్తున్నారు. (‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020లో’)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top