వేర్‌ ఈజ్‌ దీపికా?

where is deepika padukone in priyanka chopra engagement - Sakshi

ముంబైలో నిక్‌ జోనస్‌– ప్రియాంకా చోప్రాల నిశ్చితార్థం సన్నిహితులు, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. నైట్‌ గ్రాండ్‌ పార్టీ అరేంజ్‌ చేశారు. పార్టీ టైమ్‌ అయ్యింది. వచ్చిన అతిథులను రిసీవ్‌ చేసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు మధు చోప్రా (ప్రియాంక  తల్లి). అప్పుడే హీరోయిన్స్‌ పరిణీతి చోప్రా, ఆలియా భట్‌ తళుక్కున మెరిశారు. పార్టీ కళ వచ్చేసింది. అంతలోనే... సల్మాన్‌ఖాన్‌ సిస్టర్‌ అర్పితా ఖాన్, దర్శకుడు విశాల్‌ భరద్వాజ్, ప్రొడ్యూసర్‌ సిద్ధార్థ్‌ రాయ్‌ కపూర్‌.. ఇలా చాలా మంది బాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు రావడంతో పార్టీ హడావిడి మొదలైంది. ఇంతలోనే ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీతో పాటు మరికొంతమంది వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ టైమ్‌లో రణ్‌వీర్‌సింగ్‌ రావడం ఆ పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారిందట.

త్వరలో దీపికా పదుకోన్‌ను పెళ్లి చేసుకోబోయే రణ్‌వీర్‌సింగ్‌ ఎందుకు సింగిల్‌గా వచ్చాడు? అంటే.. దీపికా పదుకోన్‌కు ప్రియాంక ఆహ్వానం పంపలేదా? వేర్‌ ఈజ్‌ దీపికా? అనే అనుమానాలను లేవదీశారు పార్టీకి వచ్చిన కొందరు. అదేం లేదు.. దీపిక కంటే ప్రియాంకా చోప్రా ఐదేళ్లు పెద్ద అయినప్పటికీ వాళ్లిద్దరూ ఫ్రెండ్స్‌గానే ఉంటారు. మూడేళ్ల క్రితం రణ్‌వీర్‌సింగ్‌ నటించిన ‘బాజీరావ్‌ మస్తానీ’ సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. సో.. ఆహ్వానం అందే ఉంటుందని మరికొందరు  అంచనా వేస్తున్నారు. మరి... ఈ విషయంపై దీపికా అయినా లేక ప్రియాంకా చోప్రా అయినా నోరు విప్పితే కానీ గాసిప్‌ రాయుళ్ల నోటికి మూత పడదు. ఇవన్నీ సరే కానీ.. త్వరలో రణ్‌వీర్‌–దీపిక  నిశ్చితార్థం జరిగితే అప్పుడు ఆ వేడుకకు ప్రియాంక వస్తారా? రారా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌లో మొదలైన మరో హాట్‌ టాపిక్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top