సంక్రాంతికి...

Viswasam movie released on next year sanktanthi - Sakshi

పొంగల్‌ బాక్సాఫీస్‌పై అజిత్‌ గురిపెట్టాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. శివ దర్శకత్వంలో అజిత్‌ హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. వివేక్, యోగిబాబు, బోస్‌ వెంకట్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘వీరమ్, వేదాళం, వివేగం’ సినిమాల తర్వాత అజిత్‌–శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘విశ్వాసం’ చిత్రాన్ని ఈ  ఏడాది దీపావళికి రిలీజ్‌ చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని కోలీవుడ్‌ టాక్‌. సెకండ్‌ షెడ్యూల్‌ ఈరోజు నుంచి స్టార్ట్‌ అవుతుంది. తన కెరీర్‌లో వంద సినిమాలకు సంగీతం అందించిన డి. ఇమ్మాన్‌ తొలిసారి అజిత్‌తో వర్క్‌ చేస్తున్నారు. హాస్యనటుడు యోగిబాబు కెరీర్‌లో ‘విశ్వాసం’ 100వ సినిమా కావడం విశేషం.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top