breaking news
Bose Venkat
-
‘చంద్రేశ్వర’ మూవీ రివ్యూ
ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే కోణంలో చాలా ఛేంజ్ వచ్చింది. కంటెంట్ ఉంటేనే థియేటర్లకు వస్తున్నారు. రొటీన్ చిత్రమే అని టాక్ వస్తే చాలు, ఆ సినిమా వైపు అసలు చూడను కూడా చూడటం లేదు. ఓటీటీలు వచ్చిన తర్వాతే ఈ మార్పు వచ్చింది. కొన్ని రోజులుగా కంటెంట్ బేస్డ్ ఫిల్మ్‌తో వస్తున్నట్లుగా ‘చంద్రశ్వేర’ మూవీ టీమ్ చెబుతూ వస్తుంది. అందులోనూ ఆర్కియాలజీ నేపథ్యంలో పురాతన కాలం నాటి ఓ గుడికి సంబంధించిన స్టోరీ లైన్‌తో ‘చంద్రేశ్వర’ తెరకెక్కిందని, ఈ సినిమా అందరూ చూడాలని మేకర్స్ చెబుతూ వచ్చారు. మరి ఇందులో ఉన్న విషయం ఏమిటి? అది ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుంది? రివ్యూలో తెలుసుకుందాం.‘చంద్రేశ్వర’ కథేంటంటే.. నందివర్మ పర్వతం కింద పురాతన కాలంనాటి ఓ గుడి కప్పెట్టబడి ఉందని, ఆ గుడి లోపల నిధి ఉందని తెలిసి ఆర్కియాలజీ విభాగానికి చెందిన ఎమ్‌డి చక్రవర్తి (నిళల్గళ్ రవి), ఓ టీమ్‌ని ఆ పర్వతం ఉన్న చంద్రగిరికి పంపిస్తాడు. ప్రొఫెసర్ బోస్ (బోసే రవి) ఆధ్వర్యంలో అతనితో కలిపి 8 మంది టీమ్ ఆ గ్రామానికి వెళుతుంది. కానీ, ఆ గ్రామ ప్రజలు, వారిని ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకుంటారు. అంతకు ముందు కూడా ఇలాగే కొందరు వచ్చి చేసిన పనులతో ఊరిలో ఎవరో ఒకరు చనిపోతూనే ఉన్నారని అడ్డుకుంటారు. ఎలాగోలా వారిని ఒప్పించి, బోస్ టీమ్ అక్కడ తవ్వకాలను చేపడుతుంది. కాకపోతే చీకటి పడిన తర్వాత ఆ గ్రామంలో ఎవరూ తిరగకూడదు. ఎవరైనా అలా ప్రయత్నిస్తే దారుణంగా చనిపోతుంటారు. అప్పుడే చంద్రగిరికి సబ్ ఇన్స్పెక్టర్గా వచ్చిన గురు వర్మ (ఆశ వెంకటేష్), ఆ చావులు వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవడానికి, తన స్టైల్లో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఈ క్రమంలో ఆర్కియాలజీ టీమ్‌లోని అఖిల (ఆశ వెంకటేష్)తో ప్రేమలో పడతాడు. ఇక తన ఇన్విస్టిగేషన్లో గురు వర్మ సంచలన విషయాలు తెలుసుకుంటాడు. ఆ విషయాలు ఏంటి? ఆ ఊరిలో చావులకు కారణం ఏంటి? గురు వర్మ ఈ సమస్యను ఎలా సాల్వ్ చేశాడు? నిజంగానే ఆ గ్రామంలో గుడి, అందులో నిధి ఉన్నాయా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఆర్కియాలజీ నేపథ్యంలో ఇంతకు ముందు చాలా సినిమాలే వచ్చాయి కానీ, ఇందులో ఆసక్తికరమై కథ, స్క్రీన్‌ప్లేతో చూస్తున్న ప్రేక్షకులకు కనువిందు కలిగిస్తాడు దర్శకుడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సన్నివేశం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పవచ్చు. సినిమా స్టార్టింగ్ సీనే.. ఒక గొప్ప సినిమా చూడబోతున్నామనే అనుభూతిని కలిగిస్తుంది. ఆ తర్వాత నందివర్మ, విషయ్ గౌడ ఎపిసోడ్.. ఈ సినిమాకు బలం. అది మిస్సయితే ఈ సినిమా ఏం అర్థం కాదు. మేకర్స్ పోస్టర్లో ‘ప్రారంభం మిస్ కాకండి’ అని ప్రింట్ చేయించి ఉండాల్సింది. సినిమాపై ఇంకాస్త ఇంట్రస్ట్ వచ్చేది. ఒక రాజుని ఓడించాలంటే.. ముందు వారి ఆచార వ్యవహారాలపై దెబ్బకొట్టాలనే డైలాగ్, సనాతన పద్దతులను చూపించిన విధానం, హిస్టారికల్ ఎవిడెన్స్ వంటి పదాలు, విగ్రహాల మార్పిడి ఇవన్నీ కూడా దర్శకుడి మేధస్సుని తెలియజేస్తాయి.గుడి విశిష్టతను తెలిపే ఎపిసోడ్, అదృశ్య ఖడ్గంతో పాటు నిధి కోసం అఖిల చెప్పే 4 సీక్రెట్ దారులు వంటి వన్నీ కూడా సినిమాలో లీనమయ్యేలా చేస్తాయి. కాస్త పేరున్న నటీనటులు కనుక ఇందులో నటించి ఉంటే, అలాగే ద్వితీయార్థంపై ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. సబ్ ఇన్స్పెక్టర్గా సురేష్ రవి ఆహార్యం బాగుంది. ఫస్ట్ సీన్లోనే అతని టాలెంట్ ఏంటో చెప్పే ప్రయత్నం బాగుంది. ఆ తర్వాత చంద్రగిరి వచ్చినప్పటి నుంచి ఆయన చేసే ఇన్విస్టిగేషన్ అందరినీ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎందుకంటే, ఆ ట్విస్ట్‌లన్నింటికీ చెక్ పెట్టేది అతనే. పురాతన గ్రాంథిక భాష తెలిసిన ఎక్స్‌పర్ట్‌గా ఆర్కియాలజీ టీమ్‌లో కీలక పాత్ర పోషించే అఖిల పాత్రలో ఆశ వెంకటేష్ మెప్పిస్తుంది. తన అందంతోనూ, అలాగే ప్రేమికురాలిగా, టీమ్ సభ్యురాలిగా వైవిధ్యంగా కనిపించే అవకాశం ఆమెకు దక్కింది. చక్రవర్తిగా నిళల్గళ్ రవి, ప్రొఫెసర్ బోస్‌గా బోసే రవి, గ్రామ పెద్దగా చేసిన అతను, ఇంకా ఆర్కియాలజీ టీమ్ మెంబర్స్ అంతా వారి పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు ప్రధాన హైలెట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. సినిమా కొద్దిగా డౌన్ అవుతున్న ప్రతిసారి సంగీత దర్శకుడు అలా నిలబెట్టేశాడు. అఖిల అఖిల పాట బాగుంది. సినిమాటోగ్రపీ కూడా పురాతన రోజులకు తీసుకెళుతుంది. మొదట్లో వచ్చే విజువల్స్ అన్నీ కూడా సినిమాపై ఆసక్తిని కనబరుస్తాయి. ఎడిటింగ్ పరంగా ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ట్రిమ్ చేసి ఉండొచ్చు. ఉన్నంతలో అయితే సినిమా బాగానే ఉంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా ఉన్నాయి. నటీనటులు: సురేశ్ రవి, ఆశ వెంకటేష్, నిళల్గళ్ రవి, బోసే వెంకట్, ఆడుకాలం మురుగదాస్, జెఎస్కె గోపి తదితరులుసంగీతం: జెరాడ్ ఫిలిక్స్డిఓపి: ఆర్వీ సీయోన్ ముత్తుఎడిటర్: నందమూరి హరినిర్మాత: డా. రవీంద్ర చారిడైరెక్టర్: జీవీ పెరుమాళ్ వర్ధన్విడుదల తేదీ: 27 జూన్, 2025 -
సంక్రాంతికి...
పొంగల్ బాక్సాఫీస్‌పై అజిత్ గురిపెట్టాడా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. శివ దర్శకత్వంలో అజిత్ హీరోగా తమిళంలో రూపొందుతున్న సినిమా ‘విశ్వాసం’. నయనతార కథానాయిక. వివేక్, యోగిబాబు, బోస్ వెంకట్ కీలక పాత్రలు చేస్తున్నారు. ‘వీరమ్, వేదాళం, వివేగం’ సినిమాల తర్వాత అజిత్–శివ కాంబినేషన్లో రూపొందుతున్న ‘విశ్వాసం’ చిత్రాన్ని ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. తాజాగా ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందని కోలీవుడ్ టాక్. సెకండ్ షెడ్యూల్ ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. తన కెరీర్లో వంద సినిమాలకు సంగీతం అందించిన డి. ఇమ్మాన్ తొలిసారి అజిత్‌తో వర్క్ చేస్తున్నారు. హాస్యనటుడు యోగిబాబు కెరీర్లో ‘విశ్వాసం’ 100వ సినిమా కావడం విశేషం. -
కవన్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది!
నటుడు బోస్‌వెంకట్ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది మెట్టిఒలి సీరియల్. ఆ మెగా సీరియల్లో ఒక ప్రధాన పాత్ర ద్వార బుల్లితెర ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించకున్న బోస్ వెంకట్ ప్రఖ్యాత దర్శకుడు భారతీరాజ్ కంటబడ్డారు. ఆయన దర్శకత్వం వహించిన ఈరనిలం చిత్రం ద్వారా విలన్‌గా వెండితెరకు పరిచయమై మంచి పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత వరుసగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 60కి పైగా చిత్రాల్లో నటించారు. వాటిలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించిన శివాజీ, సూర్యతో కలిసి నటించిన సింగం వంటి గుర్తింపు తెచ్చిపెట్టిన పలు చిత్రాలు ఉన్నాయి. పాత్రల్లో ఒదిగిపోవడానికి శాయశక్తులా ప్రయత్నించే బోస్వెంకట్కు కో చిత్రంలోనే దర్శకుడు కేవీ. ఆనంద్ మంచి పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు. అదే దర్శకుడు తాజాగా బోస్వెంకట్లోని టాలెంట్‌ను గుర్తించి కవన్ చిత్రంలో పూర్తి స్థాయి ప్రతినాయకుడి పాత్రలో నటించే అవకాశం ఇచ్చి పలువురి ప్రశంసలకు కారణం అయ్యారు. విజయ్‌సేతుపతి కథానాయకుడిగా సీనియర్ నటుడు టి.రాజేందర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బోస్‌వెంకట్ ప్రతినాయకుడిగా నటించారు.శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో తన నటనకు అటు అభిమానుల నుంచి, ఇటు చిత్ర ప్రముఖల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయని సంతోషంతో చెప్పారు నటుడు బోస్‌వెంకట్. తాను పూర్తిస్థాయి విలన్‌గా నటించిన తొలి చిత్రం ఇదేనని తెలిపారు. నిజానికి ఈ పాత్రను నటుడు ప్రకాశ్‌రాజ్ నటించాల్సి ఉందని, ఆయన నటించలేని పరిస్థితుల్లో ఆ అదృష్టం తనను వరించిందని అన్నారు. ఈ పాత్ర కోసం అరగుండు, పంచెకట్టు లాంటి గెటప్‌లో తనను తాను పూర్తిగా మార్చుకుని దర్శకుడు కేవీ.ఆనంద్ ముందు నిలిచి అవకాశాన్ని పొందానని చెప్పారు.కవన్ చిత్రం తన సినీ జీవితాన్నే మలుపు తిప్పిందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కార్తీ హీరోగా నటిస్తున్న ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంలో పోలీస్‌గా విభిన్న పాత్రను పోషిస్తున్నానని, చిత్రం అంతా కనిపించే ఈ పాత్ర తనకు మంచి పేరును తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.అదే విధంగా మరో చిత్రంలోనూ వైవిధ్య పాత్రను పోషిస్తున్నట్లు బోస్‌వెంకట్ తెలిపారు.