విశాల్‌ లవ్‌ మ్యారేజ్‌ | Vishal To Marry Hyderabad Girl Anisha | Sakshi
Sakshi News home page

Jan 11 2019 12:13 AM | Updated on Jan 11 2019 8:25 AM

Vishal To Marry Hyderabad Girl Anisha - Sakshi

విశాల్‌

‘ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు’ అంటుంటారు. కానీ విశాల్‌ విషయంలో ఇది రివర్స్‌. ‘బిల్డింగ్‌ కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అనాలి. తమిళ నటీనటుల సంఘానికి సొంత భవనం నిర్మించాకే పెళ్లి అని గతంలో విశాల్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అది నిర్మాణంలో ఉంది. దాంతో పాటు నిర్మాతల సంఘం అధ్యక్షుడిగా నిర్మాతల మండలి కోసం ఓ భవంతి కట్టిస్తున్నారు విశాల్‌. ఇక పెళ్లి చేసుకోవడమే ఆలస్యం. పెళ్లి కూడా ఖరారైంది. ప్రస్తుతం విశాల్‌ పెళ్లి గురించే కోలీవుడ్‌లో చర్చ. (విశాల్‌ పెళ్లి.. వరలక్ష్మి ఘాటు రిప్లై)

‘త్వరలోనే హైదరాబాద్‌కు చెందిన బిజినెస్‌మేన్‌ కూతురు అనీషాతో విశాల్‌ వివాహం చేయబోతున్నాం’ అని విశాల్‌ తండ్రి, నిర్మాత జీకే రెడ్డి ఆల్రెడీ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అది పెద్దలు కుదిర్చిన వివాహం అనుకున్నారంతా. కానీ ప్రేమ వివాహమే అని విశాల్‌ కన్ఫర్మ్‌ చేశారు. హైదరాబాద్‌ బిజినెస్‌మేన్‌ విజయ్‌ రెడ్డి, పద్మజ కుమార్తె అనీషను విశాల్‌ పెళ్లాడనున్నారు. ‘‘మాది లవ్‌ మ్యారేజ్‌. వచ్చే వారంలో మా రెండు కుటుంబాలు కలుసుకొని ఎంగేజ్‌మెంట్‌ డేట్‌ని ఫిక్స్‌ చేస్తారు. నిర్మాతల సంఘం నూతన భవన నిర్మాణం పూర్తయ్యాక, అందులోనే పెళ్లి చేసుకుంటాను’’ అని విశాల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement