'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ' | Vikramasimha trails at Andhra Pradesh box office, earns Rs.42 crore worldwide | Sakshi
Sakshi News home page

'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ'

May 26 2014 9:01 PM | Updated on Sep 2 2017 7:53 AM

'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ'

'మనం' ముందు నిలబడలేకపోయిన 'విక్రమసింహ'

రజనీకాంత్ సినిమా 'విక్రమసింహ' తెలుగు బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

చెన్నై: రజనీకాంత్ సినిమా 'విక్రమసింహ' తెలుగు బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన 'మనం' సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమాతో పాటు విడుదలైన 'విక్రమసింహ' ప్రేక్షకుల ఆదరణ కరువై కాసులు కురిపించలేకపోతోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు బాగానే ఉన్నట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆరు భాషల్లో విడుదలైన ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 42 కోట్లు సాధించింది. త్రీడీ మోషన్ కాప్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించినంత స్పందన రావడం లేదు.

ఓపెనింగ్ వీకెండ్ లో మనం సినిమా ఆంధ్రప్రదేశ్ లో రూ.5.32 కోట్ల వసూళ్లు రాబట్టగా, విక్రమసింహ రూ. 2.8 కోట్లకు పరిమితమైంది. మనం సినిమా బాగుందన్న టాక్ రావడంతో వసూళ్లు పెరుగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement