సమంత మా ఇంటి బంగారం.. తొలి హీరోయిన్‌గా రికార్డ్..! | Samantha Maa Inti Bangaaram Movie Creates Record At Box Offic, Becomes Telugu Cinema’s Biggest Female Led Hit | Sakshi
Sakshi News home page

Maa Inti Bangaaram: మా ఇంటి బంగారం.. మరో రికార్డ్ ఖాయం..!

Jul 7 2026 9:59 PM | Updated on Jul 8 2026 1:13 PM

Samantha Maa Inti Bangaaram movie Creates record at box office as first film

సమంత లీడ్ రోల్లో వచ్చిన లేడీ ఓరియంటెడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం మౌత్ టాక్‌తో మూడు వారంలోనూ వసూళ్లపరంగా రాణిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రూ.90 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటికే తెలుగు సినీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా ఘనత సాధించింది.

ఇదే జోరు కొనసాగితే మా ఇంటి బంగారం మరో రికార్డ్ సాధించనుంది. ఈ మూవీ రిలీజై దాదాపు 18 రోజులైన కలెక్షన్స్ పరంగా ఏ మాత్రం తగ్గడం లేదు. నార్త్ అమెరికాలో 2 మిలియన్ల డాలర్లకు పైగా కలెక్షన్స్‌తో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ జోరు చూస్తుంటే మా ఇంటి బంగారం ఏకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసేలా కనిపిస్తోంది. 

అరుంధతి, మహానటి రికార్డ్స్ బ్రేక్..

సమంత మా ఇంటి బంగారం మూవీ ఇప్పటికే అరుంధతి, మహానటి రికార్డ్స్ బ్రేక్ చేసింది. 2009లో రిలీజైన అరుంధతి రూ.70 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2018లో కీర్తి సురేశ్ నటించిన మహానటి 80 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ ఏడాది రిలీజైన మా ఇంటి బంగారం మాత్రం ఈ రెండు సినిమాల రికార్డ్స్‌ను అధిగమించింది. తాజా వసూళ్లు చూస్తే మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది. అదే జరిగితే వంద కోట్లు సాధించిన టాలీవుడ్ హీరోయిన్‌గా సామ్ రికార్డ్ సృష్టిస్తుంది. రాబోయే రోజుల్లో వసూళ్ల సెంచరీ కొట్టనుందా? లేదా అన్నది తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement