ప్రయాణం ముగిసింది | Varun Tej Antariksham 9000 KMPH wraps up its shoot | Sakshi
Sakshi News home page

ప్రయాణం ముగిసింది

Oct 2 2018 2:39 AM | Updated on Oct 2 2018 2:39 AM

Varun Tej Antariksham 9000 KMPH wraps up its shoot - Sakshi

కిట్టు, జ్ఞానశేఖర్, లావణ్యా త్రిపాఠి, సంకల్ప్, వరుణ్‌ తేజ్, రాజీవ్‌రెడ్డి

అంతరిక్షానికి ప్రయాణం చేసిన వరుణ్‌ తేజ్‌ ఆ జర్నీని ముగించేశారు. ఆ జర్నీని ప్రేక్షకులకు చూపించడమే ఆలస్యం అంటున్నారు. వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అంతరిక్షం 9000 కేయంపీహెచ్‌’. అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. తొలి స్పేస్‌ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ వ్యోమగామిగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్‌ సోమవారంతో పూర్తయింది. ‘‘అంతరిక్షం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టేశాం. ఈ సినిమా షూటింగ్‌ చేయడం అమేజింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ అని వరుణ్‌ తేజ్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ 21న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి  కెమెరా: జ్ఞానశేఖర్, సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి.

Advertisement
 
Advertisement
Advertisement