పవన్ హీరోగా 'దేవుడే దిగి వస్తే'..? | trivikramsrinivas, Pawan Kalyan movie title devude dhigi vasthe | Sakshi
Sakshi News home page

పవన్ హీరోగా 'దేవుడే దిగి వస్తే'..?

Oct 5 2016 11:08 AM | Updated on Mar 22 2019 5:33 PM

పవన్ హీరోగా 'దేవుడే దిగి వస్తే'..? - Sakshi

పవన్ హీరోగా 'దేవుడే దిగి వస్తే'..?

పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్...

పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఇంట్రస్టింగ్ వార్త టాలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తోంది. అ..ఆ.. సక్సెస్ తరువాత ఇంత వరకు సినిమా మొదలు పెట్టని త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కోసం కథ రెడీ చేస్తున్నాడట.

ఈ సినిమాకు దేవుడే దిగి వస్తే అనే టైటిల్ను పరిశీలుస్తున్నారు. ఇప్పటికే దేవుడు కాన్సెప్ట్తో త్రివిక్రమ్, ఖలేజా సినిమాను తెరకెక్కించగా, పవన్, గోపాల గోపాల సినిమాలో దేవుడిగా నటించాడు. తాజాగా మరోసారి ఇద్దరు కలిసి దేవుడు కాన్సెప్ట్తో సినిమా చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాను త్రివిక్రమ్ గత చిత్రాలను నిర్మించిన రాధకృష్ణ 100 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.

ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. పవన్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాటమరాయుడు షూటింగ్లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్లాన్ చేసిన పవర్ స్టార్, వెంటనే మరో సినిమాను లైన్లో పెట్టాలని భావిస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement