త్రీఎఫ్‌ ఉంటే చాలు! | Trisha Replies To Fan Questions In social Media | Sakshi
Sakshi News home page

త్రీఎఫ్‌ ఉంటే చాలు!

May 27 2020 12:00 AM | Updated on May 27 2020 12:00 AM

Trisha Replies To Fan Questions In social Media - Sakshi

‘త్రీఎఫ్‌’ ఉంటే చాలు. నేను చాలా హ్యాపీగా ఉంటాను’’ అంటున్నారు త్రిష. ‘త్రీఎఫ్‌’ అంటే ఏంటి? అని ఆలోచిస్తున్నారు కదూ! ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్‌’ అన్నమాట. తమ అభిమానులతో టచ్‌లో ఉండేందుకు అప్పుడప్పడూ సినీతారలు సోషల్‌ మీడియాలో చిట్‌ చాట్‌ చేస్తుంటారు. ఇటీవల త్రిష చిట్‌ చాట్‌ చేశారు. ‘మిమ్మల్ని హ్యాపీగా ఉంచే మూడు అంశాల గురించి చెప్పండి’ అని ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ‘ఫుడ్, ఫ్రెండ్స్, ఫిల్మ్స్‌’ అని చెప్పారు త్రిష. ‘మీ గురించి మూడు మాటల్లో ఏం చెబుతారు?’ అనే ప్రశ్నకు ‘ధైర్యం, నమ్మకం, నిజాయితీ’ అని బదులు చెప్పారు. ‘ఎవరికీ తెలియని మీలో ఉన్న ఓ ప్రతిభ గురించి’ అనే ప్రశ్నకు ‘ఇంటిని సూపర్‌గా శుభ్రం చేస్తాను. నేను శుభ్రం చేశాక ఇంట్లో ఎక్కడా మురికిని కనిపెట్టలేం’ అని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement