ఆ సినిమాతో సరికొత్త అధ్యాయం | Starting a new chapter in my career with 'Haider', Shraddha kapoor | Sakshi
Sakshi News home page

ఆ సినిమాతో సరికొత్త అధ్యాయం

Sep 27 2014 5:56 PM | Updated on Apr 3 2019 6:23 PM

ఆ సినిమాతో సరికొత్త అధ్యాయం - Sakshi

ఆ సినిమాతో సరికొత్త అధ్యాయం

హైదర్’ ’సినిమాతో తన కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందని బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆశాభావం వ్యక్తం చేసింది.

బెంగళూర్: ‘హైదర్’ ’సినిమాతో తన కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవుతుందని బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ ఆశాభావం వ్యక్తం చేసింది. విమర్శకుల మెప్పుపొందిన దర్శకుల్లో ఒకరైన విశాల్ భరద్వాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఆషిఖి-2’, ‘ఏక్ విలన్’ వంటి హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ ఈ రెండు ప్రేక్షకుల మెప్పు పొందడంపట్ల సంతోషం వ్యక్తం చేసింది.‘హైదర్’ కూడా హిట్ సినిమాల జాబితాలో నిలుస్తుందని ఆశిస్తోంది.

 

‘ఈ సినిమా నా కెరీర్‌కు కచ్చితంగా మరో శుభసూచిక అవుతుంది.నా కెరీర్‌లో ఇది కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుంది’ అని అంది. ‘విశాల్... ఎన్నో గొప్ప సినిమాలు తీశారు. ఆయన తీసిన సినిమాల్లో ప్రముఖ తారల అభిన యం ఎన్నటికీ మరువలేనిది. ఇప్పుడు కూడా అటువంటిదే మరోసారి జరుగుతుందని భావిస్తున్నా’ అంది. షేక్‌స్పియర్ రచించిన ఓ విషాద నాటకాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే నెల రెండో తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement