'క్షత్రియ' మళ్లీ ప్రాణం పోస్తుందంటున్న శ్రీకాంత్ | Srikanth hopes to revive career with 'Kshatriya' | Sakshi
Sakshi News home page

'క్షత్రియ' మళ్లీ ప్రాణం పోస్తుందంటున్న శ్రీకాంత్

Sep 11 2013 11:53 AM | Updated on Aug 28 2018 4:30 PM

వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు.




వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు. ''క్షత్రియ సినిమా మళ్లీ నన్ను టాలీవుడ్లో నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది. ఇటీవల వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదని నాకు తెలుసు. కానీ ఇది కేవలం తాత్కాలికమే. మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను'' అని శ్రీకాంత్ అన్నాడు.

అయినా సినిమా విజయం అనేది నిర్మాతకే ఎక్కువ అవసరమని, తన కెరీర్లో జయాపజయాలు రెండింటినీ చూశానని చెప్పాడు. ప్రతిసారీ పరాజయం నుంచి తాను విజయాలు సాధిస్తూనే వచ్చానని అన్నాడు. కుంకుమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజు తోట, కళ: సాయిమణి, కూర్పు: శంకర్, లైన్ ప్రొడ్యూసర్: తమ్మినీడి సతీష్‌బాబు.

Advertisement
 
Advertisement
Advertisement