అలాంటి విమర్శలే నాకు స్ఫూర్తి

Sonu Sood Not Care About Allegations Of Helping Migrants  - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా వలస కూలీలది దయనీయ స్థితి అనే చెప్పాలి. ఉన్న చోట ఉపాధి లేకపోవడంతో స్వగ్రామాలకు వెళదామనుకున్నా వాహనాల రాకపోకలు లేవు. అయినా వందల కిలోమీటర్లు నడుస్తూ సొంతూళ్లకు ప్రయాణమయ్యారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రభుత్వాలతో పాటు ప్రైవేటు వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు వాహనాలను సమకూర్చాయి.

బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కూడా బస్సులు, రైళ్లు, విమానాల్లో వలస కూలీలను తన సొంత ఖర్చుతో స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు చేయడంతో ఆయనపై ప్రశంసల జల్లులు కురిశాయి. అయితే ‘రాజకీయ లబ్ధి కోసమే సోనూ సూద్‌ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’ అంటూ కొందరు రాజకీయ నాయకులు విమర్శించారు కూడా. దీనిపై  సోనూ సూద్‌ స్పందిస్తూ – ‘‘ఏదైనా మంచి పని చేయాలనుకునేవారిపై ఇలాంటి ఆరోపణలు, విమర్శలు రావడం సహజం. నాపై వచ్చిన విమర్శలు, ఆరోపణల్ని నేనిప్పటివరకూ పట్టించుకోలేదు.. నా గురించి ఏం రాస్తున్నారో అని చూసే తీరిక కూడా లేదు. అయినా మరెన్నో మంచి పనులు, సేవా కార్యక్రమాలు చేయడానికి ఇలాంటి విమర్శలు, ఆరోపణలు నాకు బలాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి’’ అన్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top