మాకు మంచి జరగాలి | Siva Karthikeyan's Bilngual Project Launched | Sakshi
Sakshi News home page

మాకు మంచి జరగాలి

Jun 28 2018 12:16 AM | Updated on Jul 23 2019 11:50 AM

Siva Karthikeyan's Bilngual Project Launched - Sakshi

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

... అని మనసారా కోరుకుంటున్నారు కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌. సర్లే కానీ మాకు అని అంటున్నారు మరి మిగతా వారెవరో అంటే... ప్రస్తుతానికి తమిళ నటుడు శివకార్తీకేయన్, ఏఆర్‌ రెహ్మాన్‌ అండ్‌ టీమ్‌ అన్నమాట. ‘ఇండ్రు నేట్రు నాళై’ ఫేమ్‌ ఆర్‌. రవికుమార్‌ దర్శకత్వంలో శివకార్తీకేయన్‌ హీరోగా 24ఎమ్‌ స్టూడియోస్‌ పతాకంపై రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం బుధవారం జరిగింది. బైలింగ్వల్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇషా కొప్పీకర్, భానుప్రియ, యోగిబాబు, కరుణాకరన్‌ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమంలో రకుల్‌ పాల్గొనలేకపోయారు. ‘‘మిస్సయ్యాను.. మా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను ’’అని ఆమె సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు. అన్నట్లు.. ఈ మిస్‌ ఎందుకు మిస్‌ అయ్యారంటే... కాస్త ఆరోగ్యం సరిగా లేదట. అందుకోసమే ఇంట్లో ఉంటూ హెల్దీ ఫుడ్‌ తీసుకుంటూ రికవరీ అవుతున్నారని సమాచారమ్‌. అలాగే ఈ ఏడాది దీపావళికి రిలీజ్‌ కానున్న సూర్య ‘ఎన్‌జీకే’ చిత్రంలో రకుల్‌ ఒక కథానాయిక. కార్తీ హీరోగా రూపొందుతున్న ‘దేవ్‌’ సినిమాలోనూ హీరోయిన్‌గా నటిస్తున్నారు ఆమె. మరోవైపు హిందీలో అజయ్‌ దేవగన్‌ సినిమాలో కూడా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement